సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఆర్టీసీ కార్మికుల సమ్మె 29 వ రోజు కొనసాగుతుంది. కరీంనగర్ ఆర్టీసీ డ్రైవర్ బాబు అంతిమ యాత్రలో పాల్గొన్న ఎంపీ బండి సంజయ్ పై పోలీసుల దాడిని నిరసిస్తూ ఆర్టీసీ కార్మికులు బస్ డిపో నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భాజపా నాయకులతో కలిసి ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో మానవహారంగా ఏర్పడి రాస్తారోకో చేపట్టారు. ఎంపీ బండి సంజయ్ పై దాడికి పాల్పడిన పోలీసులను సస్పెండ్ చెయ్యాలని, ఇక నైన ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేశారు.