హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్

565చూసినవారు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో బిసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. కోహెడ మండలం శనిగరం పెద్ద చెరువును సందర్శించి అక్కడ జరుగుతున్న పనులపై ఆరా తీశారు. గ్రామంలో తాగునీటి ఎద్దడి రాకుండా బోర్ వేసుకోవడంతోపాటు అదనపు మోటర్లు ఏర్పాటు చేసి త్రాగునీరు అందించాలని అధికారులకు సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే లోపు పాఠశాల తరగతి గదులకు కలర్స్, టాయిలెట్స్ నిర్మించాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్