మెదక్ లో దారుణ ఘటన బుధవారం చోటుచేసుకుంది. మూడున్నరేళ్ల బాలికపై ఆటో డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. పట్టణ శివారు పిల్లికొటాల్ డబుల్ బెడ్రూమ్ కాలనీలో నివాసం ఉండే ఆటో డ్రైవర్ అబ్బాస్ పట్టణంలోని ఓ కాలనీలో ఉండే తన మరదలు ఇంటికి తరచూ వచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలో పక్కింట్లో ఉండే మూడున్నరేళ్ల బాలికకు చాక్లెట్లు ఇచ్చి లోబరచుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.