కలెక్టర్ కార్యాలయం ముందు మాదారం గ్రామస్తుల ధర్నా

65చూసినవారు
కలెక్టర్ కార్యాలయం ముందు మాదారం గ్రామస్తుల ధర్నా
అక్రమ క్రషర్లను తొలగించాలని కోరుతూ సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు జిన్నారం మండలం మాదారం గ్రామస్తులు సోమవారం ధర్నా నిర్వహించారు. మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్ మాట్లాడుతూ అనుమతి లేకుండా క్రషర్లు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. వీటి వల్ల గ్రామంలో ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ వల్లూరు క్రాంతికి వినతిపత్రం సమర్పించారు.

సంబంధిత పోస్ట్