రాష్ట్ర, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ సంగారెడ్డి పట్టణంలో బుధవారం పర్యటిస్తారని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పట్టణంలో నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.