సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని బోరు నుంచి నీరు బయటకు బుధవారం వస్తున్నాయి. భారీ వర్షాలు కురవడంతో బోరు నుండి నీళ్లు బయటకు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. భూగర్భ జలాలు పెరగడంపై అధికారులు హర్షం వ్యక్తం చేశారు. బోరు నుంచి నేరుగా నీళ్లు బయటకు వస్తున్నడంతో వివిధ శాఖల ఉద్యోగులతో పాటు స్థానికులు కూడా చూసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చారు.