దీపం అంటుకొని పెంకుటింట్లో విలువైన వస్తువులు అగ్నికి ఆహుతైన ఘటన సిద్దిపేటలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అంబేడ్కర్ నగర్ కు చెందిన తొంటోల్ల జ్యోతి స్థానిక అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా చేస్తోంది. ఇంట్లో దేవునికి దీపం వెలిగించి వెళ్లింది. మధ్యాహ్నం ఇంట్లో నుంచి పొగలు రావటంతో స్థానికులు వెంటనే పోలీసులు, అగ్నిమాపకశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు.