సి.నారాయణరెడ్డి 1931, జూలై 29న కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామం హనుమాజీపేటలో మల్లారెడ్డి, బుచ్చమ్మ దంపతులకు జన్మించారు. నారాయణ రెడ్డి ప్రాథమిక విద్య గ్రామంలోని వీధిబడిలో సాగింది. ఉర్దూ మాధ్యమంలో సిరిసిల్లలో మాధ్యమిక విద్య, కరీంనగర్‌లో ఉన్నత పాఠశాల విద్య అభ్యసించారు. హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్, బి.ఏ. కూడా ఉర్దూలోనే చదివారు. ఇంకా ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి తెలుగు సాహిత్యములో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ, డాక్టరేటు డిగ్రీ పొందారు.