రామడుగు మండలం తిర్మలాపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫి చేసిన సందర్భంగా గ్రామ పంచాయతీ వద్ద రైతులు, కాంగ్రెస్ నాయకులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో బక్కశెట్టి నర్సయ్య, కట్ల శంకర్, తడగొండ లక్ష్మణ్, అమోస్, హనుమంతు, బుర్ర రాజమల్లు, తదితరులున్నారు.