గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి రామగుండం నియొజకవర్గంలోని గోధావరి పరివాహక ప్రాంత గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమయం కావడంతో, లింగాపూర్ గ్రామంలోకి వరద నీరు చేరి ఇబ్బంది కరంగా మారింది. దీంతో టిఆర్ఎస్ నాయకులు కందుల సంధ్యారాణి గ్రామంలో నీటితో నిండిన ఇండ్లని పరిశీలించి అధికారులకి సమాచారం అందించారు.
ఈ సందర్బంగా కందుల సంధ్యారాణి-పొచం దంపతులు, గ్రామ ప్రజలంతా కలిసి, గోధారమ్మ శాంతించాలని ఇంతటితో ఈ విపత్తు ఆగి ప్రజల ఇబ్బందులన్ని తొలిగిపొవాలని గోదారమ్మకి మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ అర్శనపల్లి శ్రీను-మళ్లీశ్వరి, గుండు తిరుపతి, గుండు హరీష్, కందుల తిరుపతి, శ్రీకాంత్, ఆర్కూటి రమాకాంత్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.