కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 3రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గంగాధర మండలం మధురానగర్కు సమీపంలోని కుడి కాలువ తెగి వరద నీరు ఇళ్లలోకి, వీధుల్లోకి చేరింది. ఐదేళ్లుగా వరదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని 9వ వార్డు ప్రజలు బుదవారం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 50 ఇళ్లలోకి నీరు చేరిందని, సాగునీటి పారుదల శాఖ అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కోరుతున్నారు.