విలా సాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పనిచేస్తున్న వి. వసుంధర సాంఘిక శాస్త్రం, పి. ప్రభాకర్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. జిల్లా విద్యాధికారి రమేష్ విడుదల చేసిన ఎంపిక జాబితాలో వీరు పేరు ఉండడంతో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు వీరిని అభినందించారు. నేడు సిరిసిల్లలో జరిగే కార్యక్రమంలో వీరికి ఉన్నతాధికారులు ఉత్తమ అవార్డు అందజేయనున్నట్లు ప్రదానో ఉపాధ్యాయులు బోలగం శ్రీనివాస్ తెలిపారు.