బోయిన్పల్లి: తెలంగాణ రాష్ట్రంలో యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా నిరంతరం సామాజిక స్ఫూర్తిని రగిలించిన మహోన్నత వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని యువజన సంఘాల నాయకులు ఐల శివరామ్ ఆదివారం తెలిపారు. వ్యసనాల బారిన పడడం వల్ల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులకు లోనవుతున్నాయి అని అన్నారు. యువత స్వచ్ఛందంగా సమాజంలోని అని వర్గాల శ్రేయస్సు కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు.