జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల గోవిందుల పల్లె గ్రామానికి చెందిన బిజెపి నాయకులు, కార్యకర్తలు కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ ను ఆదివారం కలిసారు. కేంద్ర హోం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి కరీంనగర్ కు తొలిసారిగా వచ్చిన సందర్భంగా భారీగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు మంత్రిని కలవడానికి వచ్చారు. అనంతరం హోం శాఖ మంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు.