ఎండపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో బుధవారం గ్రామసభ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులు పంట పొలాలకు చిన్న కాల్వల ద్వారా నీరు సరిగ్గా అందడం లేదన్నారు. చెరువుల్లో సకాలంలో పూడికలు తీయిస్తే నీటి నిల్వ సంవృద్ధిగా ఉండేదని, తద్వారా చేపల పెంపకం వల్ల ముదిరాజ్, మాంసం ఉత్పత్తులు పెరిగేవని వర్షంతో లోతట్టు వాడలు జల మాయమవుతున్నాయని, వీధి దీపాల సమస్యలు ఉన్నాయని తెలిపారు.