జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్ తో పాటు నగునూరి నర్సగౌడ్, కొడిమ్యాల రాజన్న, పెద్దనవేణి శంకర్, నగునూరి రామగౌడ్, పెద్ద రామగౌడ్, తాడేపు లింగన్న, నక్క శంకర్, కుంట మహేష్, గజ్జెల రాజు, విజయ్, రెంటం శ్రీధర్, నక్క శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.