సంకష్టహర చతుర్థి సందర్భంగా రేపు ప్రత్యేక పూజలు

64చూసినవారు
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి అనుబంధ దేవాలయమైన శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో గల గణపతికి "అంగారక సంకష్టహర చతుర్థి" సందర్భంగా మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో సంకటాల శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి సేవలో పాల్గొనాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్