బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం శ్రీరాముల పల్లి గ్రామం నుండి బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున ఉప్పల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పుప్పాల రఘు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, 6 గ్యారెంటీలు అని చెప్పి ప్రజలను మోసం చేశారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.