కోతికి బయపడి వ్యక్తి మృతి

17832చూసినవారు
కోతికి బయపడి వ్యక్తి మృతి
కోతిని చూసి భయపడ్డ వ్యక్తి ఒక్కసారిగా గుండెపోటుకు గురై మరణించారు. కరీంనగర్‌లోని హనుమాన్‌నగర్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. మంగళవారం తెల్లవారుజామున 5. 30 గంటలకు రుద్రోజు రాజు సతీమణి సరస్వతి నల్లా నీళ్లు పడుతూ తలుపులు తెరిచి ఉంచారు. దాంతో ఓ కోతి ఇంట్లోకి చొరబడింది. ఆ సమయంలో ఆమె భర్త రాజు(45) ఇద్దరు కుమారులు నిద్రిస్తున్నారు. లోపలికి వెళ్లిన కోతి కుమారుడిపై కూర్చోవడాన్ని సరస్వతి గమనించి కోతి కోతి అని అరిచారు.

అరుపులు విన్న భర్త లేచి చూసే సరికి ఎదురుగా కోతి కనిపించడంతో ఒక్కసారి షాక్‌ గురై కో. తి అంటూ భయపడి పడిపోయారు. ఇరుగుపొరుగు వాళ్లు వచ్చి కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే రాజు గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించినట్లు సమాచారం. వరంగల్‌కు చెందిన రాజు మెకానిక్‌గా పని చేసేవారు. కాగా కోతుల బారి నుంచి కాపాడాలని హనుమాన్‌నగర్‌ వాసులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్