కమలాపూర్ మండలం మర్రిపల్లి గూడెం గ్రామంలో కనకధార సీడ్స్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో మిర్చి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామంలోని రసమల్ల శ్రీనివాస్ కు చెందిన మిరప తోటలో క్షేత్ర ప్రదర్శన నిర్వహించి రైతులకు సస్యరక్షణ చర్యలు, పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు ఏరియా సేల్స్ మేనేజర్ రవి, గోపీచంద్, స్వామి, రైతులు, తదితరులు పాల్గొన్నారు.