కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి పరామర్శించారు. గంగుల మాతృమూర్తి లక్ష్మీ నరసమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. బుధవారం గంగుల నివాసంలో వారి కుటుంబ సభ్యులను కలసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. లక్ష్మీ నర్సమ్మ భౌతిక కాయం పై పుష్ప గుష్పం ఉంచి నివాళులర్పించారు.