గన్నేరువరం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన కరీంనగర్ సీపీ

60చూసినవారు
గన్నేరువరం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన కరీంనగర్ సీపీ
కరీంనగర్ కమీషనరేట్ పరిధిలోని గన్నేరువరం పోలీస్ స్టేషన్ను కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి బుధవారం తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో గల పెండింగ్ కేసులపై సమీక్ష చేశారు. వాటికి గల కారణాలు తెలుసుకున్నారు. త్వరితగతిన వాటిని పూర్తి చేయాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు.

సంబంధిత పోస్ట్