కరీంనగర్ నగరంలో రూ. 40 కోట్లతో 25పార్కులను అభివృద్ధి చేసినట్లు నగర మేయర్ వై. సునీల్ రావు తెలిపారు. 42వ డివిజన్ లోని వావిలాలపల్లి పార్కులో రూ. 36 లక్షలతో నూతనంగా నిర్మించిన రీడింగ్ రూమ్, యోగ సెంటర్, లైటింగ్, వాకింగ్ ట్రాక్ లను మేయర్ ప్రారంభించారు. కార్యక్రమంలో మేచినేని వనజ- అశోక్ రావు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.