త్వరలో ఉపాధ్యాయులకు బదిలీలు

934చూసినవారు
త్వరలో ఉపాధ్యాయులకు బదిలీలు
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో పిఆర్టీయు టీఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యల్ల అమరనాథరెడ్డి, బోయినపెల్లి ఆనంద రావు లు ప్రారంభించారు. బాలికల ఉన్నత పాఠశాల, బాలుర ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కాజీ పూరా కోరుట్ల మరియు వెంకటాపుర్, పైడిమడుగు, మోహనరావు పేట, అయిలాపుర్, జొగన్ పల్లి గ్రామాల్లో ని పాఠశాల ఉపాధ్యాయులతో సభ్యత్వం నమోదు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో పీఆర్టీయూ ముందు ఉంటుంది. త్వరలో బదిలీలు, పదోన్నతులు ప్రక్రియ ప్రారంభం కానుంది. అలాగే ప్రతి ప్రభుత్వ పాఠశాలలో స్కావెంజర్ నియామకం పై ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎండి అబ్దుల్ వాజిద్, ప్రధాన కార్యదర్శి మోటూరి ప్రవీణ్ కుమార్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు తునికి వెంకట్ సుధీర్, రాష్ట్ర, జిల్లా మరియు మండల బాధ్యులు సర్తజ్ అహ్మద్, కృష్ణ మోహన్ రావు, సయ్యద్ సైఫ్ ఉద్దీన్, ఎం శీను, వెంకటరమణ, యూసుఫ్ అలీ, తిరుపతి రెడ్డి, జె సురేఖ, శోభారాణి, కొగిల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్