మాల సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు

1529చూసినవారు
మాల సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పోరండ్ల గ్రామంలో ఆదివారం మాల సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు నిర్వహించారు. మాల కులస్తులు, మహిళలు పోచమ్మ బోనాలు ఎత్తుకుని గ్రామంలోని పోచమ్మ గుడిలో బోనాలు సమర్పించారు. అనంతరం మొక్కలు చెల్లించారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం అధ్యక్షుడు సుంకరి కిరణ్, రాజవీరు, రాజు సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్