మానకొండూర్ నియోజకవర్గంలోని అలుగునూరు వద్దు శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్ష దివస్లో భాగంగా భారీ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. అధికారం నీ దగ్గర ఉండొచ్చు కానీ.. తెలంగాణ ప్రజల అభిమానం మాత్రం కేసీఆర్ కే ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.