మంథనిలో మహిళ దారుణ హత్య

30127చూసినవారు
మంథని పట్టణంలోని ఎరుకలగూడెంలో బుధవారం విషాద ఘటన చోటు చేసుకుంది. లక్ష్మిపూర్ కి చెందిన రాజమణికి పైడికుల సంతోష్ తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఈ నెల 9న మంథనిలో సంతోష్ అద్దెకు ఉంటున్న గదికి రాజమణి వచ్చింది. ఇద్దరి మధ్య గొడవ జరిగిన నేపథ్యంలో సంతోష్ ఆమెను పదునైన ఆయుధంతో హత్య చేశాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్