బిఎల్వోలు ప్రతి ఇంటికి తిరుగుతూ ఓటరు జాబితాను సవరించాలి

79చూసినవారు
బిఎల్వోలు ప్రతి ఇంటికి తిరుగుతూ ఓటరు జాబితాను సవరించాలి
కమాన్ పూర్ మండలంలోని ప్రతి బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి తిరుగుతూ ఓటర్ జాబితాను సవరించాలని కమాన్ పూర్ తహసిల్దార్ ఆరిఫోద్దీన్ అన్నారు. శుక్రవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బూత్ లెవెల్ అధికారులకు మాస్టర్ ట్రైనర్ కే శ్రీనివాస్ ఒకరోజు శిక్షణను ఇచ్చారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ ప్రతి ఇంటి ఇంటికి సర్వే నిర్వహించి ప్రతి ఇంటిలో వారి ఓటు హక్కులో ఎలాంటి తప్పులు ఉన్న వాటిని ఫారం 8 ద్వారా సరి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్