మంథని పట్టణ శివారులోని మాతశిశు ఆసుపత్రిలో పని చేస్తున్న మత్తు మందు వైద్యుడు సర్జరీ కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నాడనీ, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు బుధవారం ఫిర్యాదు చేసినట్లు బండారి సమ్మయ్య తెలిపారు. తన భార్యను ఆపరేషన్ నిమిత్తం ఆసుపత్రిలో చేర్చగా డబ్బులు ఇస్తేనే మత్తు మందు ఇస్తానని తేల్చి చెప్పాడన్నారు. రోగులను ఇబ్బంది పెడుతున్న వైద్యుడిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.