గుడుంబా స్థావరాలను ధ్వంసం చేసిన మంథని పోలీసులు

1887చూసినవారు
మంథని మండలంలో నమ్మదగిన సమాచారం మేరకు మంథని ఎస్సై చంద్ర కుమార్, పిఎస్ఐ అజయ్, మంథని పోలీస్ సిబ్బంది. గోపాల్ పూర్ గ్రామ శివారులో గల అటవీ ప్రాంతంలో ప్రభుత్వం నిషేధించిన గుడుంబాను తయారు చేస్తున్న స్థావరాలను గుర్తించి ధ్వంసం చేసారు. సుమారుగా 2000 లీటర్ల బెల్లం పాకాన్ని మరియు గుడుంబా తయారీకి ఉపయోగించే వస్తువులను ధ్వంసం చేశారు.

ప్రజా ఆరోగ్యం పై తీవ్ర దుష్ప్రభావం చూపే గుడుంబాను ఎవరైనా వ్యక్తులు తయారు చేస్తే, చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై చంద్ర కుమార్ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్