జిల్లాలో ప్రభుత్వ నిబంధనల మేరకు ఇసుక రవాణా జరిగేలా అధికారులు పకడ్బంధి పర్యవేక్షణ ఉంచాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. బుధవారం సమీకృత కలెక్టరేట్లో ఇసుక రవాణాపై అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, డిసిపి చేతనలతో కలిసి సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు.
సమావేశంలో మైనింగ్ అధికారి అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్ పాల్గొన్నారు.