పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గురువారం కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కల్లెపల్లి అశోక్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టి బొమ్మను దహనం చేశారు. పార్లమెంట్‌లో అంబేద్కర్‌ను కించపరిచేలా కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడిన తీరును నిరసిస్తూ ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్‌షాలు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అశోక్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.