లోకసభలో అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వెంటనే భర్తరఫ్ చేయాలని పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు డిమాండ్ చేశారు. గురువారం అసెంబ్లీ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్ద టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, సహచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.