జూలపల్లి మండల కేంద్రంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే తీరును పెద్దపల్లి జిల్లా పరిషత్ సీఈవో నరేందర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా జూలపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలనతో పాటు ఆన్లైన్ యాప్ లో వివరాలను నమోదు తీరును పర్యవేక్షించి అధికారులకు సూచనలు చేశారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఎంపీడీవో పద్మజ, ఎంపిఓ అనిల్ రెడ్డి అన్నారు.