సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో 4 సీసీ డ్రైనేజీల పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ చింతల సునీత రాజు, వార్డు యొక్క పరిస్థితిని ఎమ్మెల్యేకు వివరించారు. ఎనిమిదో వార్డు అన్ని రకాలుగా వెనుకంజలో ఉందని ఏదైనా ప్రత్యేక ప్యాకేజీ నిధుల ద్వారా మా యొక్క వార్డుని అభివృద్ధికి సహకరించగలరని ఎమ్మెల్యేని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్, ఎంపీపీ బాలాజీ రావు, ఏఎంసి చైర్మన్ బుర్ర శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు దున్నపోతుల రాజయ్య, ఊట్ల వర ప్రదీప్, నిషాద్ రఫిక్, పాసెడ్ల మమత, సంపత్, కో ఆప్షన్ సభ్యులు సాజిద్, కలీం వార్డు యొక్క పెద్ద మనుషులు, పానేటి నర్సయ్య, చింతల ధర్మయ్య, చింతల చిన్న నరసయ్య, గంధం కనకయ్య బండారు హుస్సేన్, నానయ్య, రేకుల ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు.