పెద్దపల్లి ట్రినిటీ డిగ్రీ పీజీ కళాశాలలో
విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రి రక్త నిల్వ కేంద్రంలో నిల్వలు లేనందున అత్యవసర పరిస్థితులలో ఆపరేషన్లకు, డెలివరీలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థులకు ఇండియన్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు కావేటి రాజగోపాల్ వివరించగా
విద్యార్థులు ముందుకు వచ్చి రక్తదానం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ రాజు కూడా రక్తదానం చేశారు.