రేపు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలు నిలిపివేస్తున్నామని శుక్రవారం డాక్టర్లు పేర్కొన్నారు. కలకత్తా లో జూనియర్ డాక్టర్ పై అత్యంత పాసవికంగా దాడి చేసి హత్య చేయడానికి నిరసిస్తూ రాష్ట్ర వైద్యుల అసోసియేషన్ పిలుపు మేరకు శనివారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సాధారణ వైద్య సేవలు, సిమ్స్ లో విధులు నిలిపివేస్తూ నిరసన తెలుపనున్నామని, అత్యవసర వైద్య సేవలు కొనసాగిస్తామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పేర్కొంది.