పుట్టినరోజు సందర్భంగా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బుధవారం తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని రుద్రంగి గ్రామంలో జన్మించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు సైతం ఎమ్మెల్యేకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.