దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో నిత్య అన్నదాన సత్రం కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం పర్యటనలో రూ.35 కోట్లు కేటాయించడం మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి వల్లనే సాధ్యమైందని ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు హింగే శ్రీకాంత్ గురువారం అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు.