వేములవాడ గుడి చెరువు పరిసరాల్లో, ఆలయ పశ్చిమ వైపున హిందూ మతానికి చెందిన భక్తుల మనోభావాలకు భంగం వాటిల్లింది. బాధ్యులైన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో ఆలయ అధికారులు ఫిర్యాదు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం, ఆలయ అర్చకులచే పుణ్యః వచన కార్యక్రమం నిర్వహించి, ఆలయ పరిసరాల్లో సంప్రోక్షణ చేసినట్లు వేములవాడ రాజన్న ఆలయ ఈవో వినోద్ రెడ్డి వెల్లడించారు.