వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో సంక్రాంతి పర్వదినం మంగళవారం నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. దీంతో ఆలయం సందడిగా మారింది. అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధర్మదర్శనంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు. స్వామి వారికి ఇష్టమైన కోడె మొక్కులు, తలనీలాలు సమర్పించుకొని సేవలో తరించారు.