హడావుడి లేకుండానే అల్లు వారింట్లో పెళ్లి వేడుక.. హాజరైన మెగాస్టార్
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట్లో పెళ్లి భాజాలు మోగాయి. ఆయన పెద్ద కుమారుడు అల్లు బాబి వారసుడు రామకృష్ణ తేజ్, సాయి సంజన వివాహ బంధంతో ఒక్కటయ్యారు. హైదరాబాద్లో ఈ పెళ్లి వేడుక వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ దంపతులు, సినీ ప్రముఖులు హాజరై కొత్త జంటని ఆశీర్వదించారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.