ఇమ్రాన్‌ఖాన్‌పై మరో ఆరు కేసులు

389చూసినవారు
ఇమ్రాన్‌ఖాన్‌పై మరో ఆరు కేసులు
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై మరో ఆరు కేసులు నమోదయ్యాయి. గత నెలలో ఆయన అరెస్ట్ సమయంలో అల్లర్లు చెలరేగాయి. ఆయన మద్దతుదారులు రావల్పిండిలోని ఆ దేశ ఆర్మీ హెడ్ కార్టర్స్‌పై దాడి చేశారు. దీంతో ఆ ఘటనలకు ఇమ్రాన్‌ఖాన్‌ను బాధ్యుడిని చేస్తూ ఈ కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 2022లో పాక్ ప్రధాని పదవిని ఇమ్రాన్ ఖాన్ కోల్పోయారు. అప్పటి నుంచి ఆయనపై దాదాపు 150 కేసులు నమోదయ్యాయి.

సంబంధిత పోస్ట్