తక్కువ ఆదాయం ఉన్నవారు, చిరు ఉద్యోగులు చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడి పెడుతుంటారు. వీటికి కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉంటుంది. అయితే వీటిపై ప్రస్తుత వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే.. పోస్టాఫీస్ సేవింగ్స్ డిపాజిట్లపై 4%, పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్స్‌లో 6.9%, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్‌లో 7.7%, కిసాన్ వికాస్ పత్రలో 7.5%, పీపీఎఫ్‌లో 7.1%, సుకన్య సమృద్ధి యోజనలో 8.2%గా ఉన్నాయి. అయితే ఈ స్కీమ్‌లన్నింటిలో కనీస పెట్టుబడి రూ.500. గరిష్ట పెట్టుబడిపై పరిమితి లేదు.