పదో తరగతి పరీక్షల అధికారికి పాముకాటు

53చూసినవారు
పదో తరగతి పరీక్షల అధికారికి పాముకాటు
ఏపీలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి.  కొన్ని రోజుల క్రితం పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్ధి పాము కాటుకు గురి కాగా.. ఇప్పుడు పరీక్షల అధికారి పాముకాటుకు గురయ్యారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట వేద స్కూల్‌లో పరీక్షల చీఫ్ సూపరిటెండెంట్‌గా కరీముల్లా వెళ్లారు. ఈ క్రమంలో పరీక్షా హాలులోనే కరీముల్లాను పాము కాటేసింది.  దీంతో అతనికి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్