ఇటీవల నాగచైతన్యతో నిశ్చితార్థం చేసుకున్న శోభిత ధూళిపాళ్ల గురించి సినీ ప్రియుల్లో ఆసక్తి పెరిగింది. ఆమె గత సినిమాలు, మిస్ ఇండియా ఎర్త్ పోటీల గురించి వెతుకుతున్నారు. ఈక్రమంలో ఆ పోటీలకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతోన్నాయి. అయితే, ఆ సమయంలో ఆమె పూర్తి భిన్నంగా కనిపిస్తుండటం గమనార్హం. 2013లో జరిగిన ఈ పోటీల్లో ఆమె టైటిల్ గెలవలేకపోయినా మిస్ టాలెంట్, మిస్ బ్యూటిఫుల్ ఫేస్ టైటిల్స్ దక్కించుకున్నారు.