ఇందిరమ్మ ఇళ్ల అర్హుల ఎంపికకు స్పెషల్ యాప్!

61చూసినవారు
ఇందిరమ్మ ఇళ్ల అర్హుల ఎంపికకు స్పెషల్ యాప్!
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లను కేటాయించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రంలో 4 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అయితే, లబ్ధిదారుల్లో నిజమైన అర్హులను గుర్తించేందుకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కోసం రూపొందించిన ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఓ జిల్లాను పైలెట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసుకుని అధికారులు యాప్ నుంచి సర్వేను ప్రారంభించనున్నారు.

సంబంధిత పోస్ట్