ఫిబ్రవరిలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

77చూసినవారు
ఫిబ్రవరిలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
ఫిబ్రవరి నెలలో శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న విశేష పర్వదినాల వివరాలను టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి 9న శ్రీపురందరదాసుల ఆరాధనోత్సవం, 10న తిరుకచ్చినంబి ఉత్సవం, 14న వసంత పంచమి, 16న రథసప్తమి, 19న తిరుకచ్చినంబి శాత్తుమొర, 20న భీష్మ ఏకాదశి, 21న కులశేఖరాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, 24న కుమారధార తీర్థ ముక్కోటి, మాఘ పౌర్ణమి గరుడసేవ వేడుకలను నిర్వహించనున్నామని, భక్తులు విశేష ఉత్సవాల్లో పాల్గొనాలని పేర్కొంది.

సంబంధిత పోస్ట్