అన్నప్రసాదాల్లో నాణ్యతపై ప్రత్యేక దృష్టి: టీటీడీ ఈవో

54చూసినవారు
అన్నప్రసాదాల్లో నాణ్యతపై ప్రత్యేక దృష్టి: టీటీడీ ఈవో
అన్నప్రసాదాల్లో నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. దళారీ వ్యవస్థ నిరోధకానికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జులైలో 22.33 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీవాణి దర్శన టికెట్లు రోజుకు వెయ్యి మాత్రమే జారీ చేస్తున్నట్లు చెప్పారు. జులైలో 1.47 లక్షల సర్వదర్శన టోకెన్లు జారీ చేశామన్నారు.

సంబంధిత పోస్ట్