విజయనగరం జిల్లా కొత్తవలస మండలం భీమాలి వద్ద రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ప్రమాదంలో బోగీలు నుజ్జునుజ్జు కావడంతో వాటిని పెద్ద యంత్రాల సాయంతో తొలగించారు. బోగీలను తొలగించేందుకు విశాఖ నుంచి
బాహుబలి క్రేన్‌ను తీసుకొచ్చి సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. బోగీల తరలింపు, ట్రాక్ పునరుద్ధరణను వేగవంతం చేశారు.